ఆరుగాలం కష్టించే రైతుకు వ్యవసాయంలో ఆటుపోట్లు తప్పనిసరి అయింది, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా, సేద్యంలో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా బలహీనమవుతున్నాడు రైతు. ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా కూడా సరైన మార్కెట్ ధర లేక చితికిలపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలకు రైతులు ప్రత్యామ్నాయంగా అనుబంధ రంగాలైన చేపలు, పాడి పోషణ, కోళ్ల పెంపకం వంటి అదనపు ఆదాయ వనరుల పై మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది ఈ విధంగానే వ్యవసాయంతో పాటు పది సంవత్సరాల నుండి నాటు, పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతున్న గుంటూరు జిల్లా, అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మ రావు పై ప్రత్యేక కథనం.
గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మ రావు, 10 సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటు నాటుకోళ్లు, పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతన్నాడు, అరుదైన మేలిరకం జాతులను పెంచుతూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తన ఇంటి దగ్గరే ఖాలీ స్థలంలో ఆరు రకాల జాతులు, 50 రకాల రంగుల గల కోళ్లను పెంచుతున్నాడు.
పందెం కోళ్ల పెంపకంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రాజసం ఉట్టిపడే ఈ కోళ్ళ ఆహారంలో పౌష్ఠిక విలువలు ఎక్కువ మోతాదులో అందించాల్సి ఉంటుంది. మరి ఈ పందెం కోళ్ల పోషణకి ఈ రైతు ఎలాంటి పద్దతులు అవలంభిస్తున్నాడు? రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? చిన్న పరిశ్రమగా సాగుతున్న ఈ కోళ్ల పెంపకం గురించి అయన మాటల్లోనే తెలుసుకుందాం.
రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా ఉండే ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర్నుండి కంటికి రెప్పగా కాపాడుకోవాలని, వాటి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే, మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నాడు అంకమ్మ రావు. మరి ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లలకు ఇచ్చే ఆహారం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోళ్లకు దాణా యాజమాన్యంతో పాటు నిర్వహణ భారం ఏ విధంగా ఉంటుంది? ఆ వివరాలు అయన మాటల్లోనే తెల్సుకుందాం.