సమగ్ర సర్వేలో భూమి హక్కులు, హద్దులు.. స్ఫష్టంగా నమోదు చేయకపోతే ఏం జరుగుతుంది?
Land Records: 2020 డిసెంబర్‌లో భూముల సమగ్ర సర్వేకు అంకురార్పన చేసింది ఏపీ ప్రభుత్వం.
Land Records: 2020 డిసెంబర్‌లో భూముల సమగ్ర సర్వేకు అంకురార్పన చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి సెంటు భూముని సమగ్రంగా సర్వే చేసి శాశ్వతంగా భూముల హక్కులు కల్పించాలన్న లక్ష్యంతో భూ హక్కు- భూ రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం 4800 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూముల సర్వే కొనసాగుతోంది. ఈ సందర్భంలో రైతులు భూమి హక్కులు, భూమి హద్దులు స్ఫష్టంగా నమోదు అయ్యే విధంగా చూసుకోవాలంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్. ఈ సర్వే విజయవంతం కావాలంటే ప్రభత్వం విస్తృతంగా భూముల సర్వే గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సర్వే జరిగే క్రమంలో సమస్యలు ఏమైనా వస్తే రైతులకు సహాయం అందించేందుకు ఒక యంత్రాగాన్ని రూపొందించే ఆలోచన ప్రభుత్వం చేయాలంటున్నారు.