Cattle Farmer: పశువుల పెంపంకందారులకి హెచ్చరిక.. ఈ విరుద్దమైన పనిచేస్తే జైలుకే..!
Cattle Farmer: గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం తర్వాత పశుపోషణపై ఆధారపడి ఉంది.
Cattle Farmer: గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం తర్వాత పశుపోషణపై ఆధారపడి ఉంది. భూమి లేని రైతులు పశువుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ భారతంలో కోట్లాది ప్రజల జీవనోపాధి పశుపోషణపై ఆధారపడి ఉంది. దీనిపై కోట్లలో సంపాదిస్తున్నవారు లక్షల్లో ఉన్నారు. దీంతో పాటు పలువురు ఆవు, గేదె పాలతో తయారు చేసిన ఉత్పత్తుల వ్యాపారం కూడా చేస్తున్నారు. దీని కోసం వారికి ఎక్కువ పాలు అవసరమవుతాయి. ఇందుకోసం పశువులకు ఇంజెక్షన్లు, టీకాలు వేస్తున్నారు. అయితే ఇది జంతు హింస అని వారు తెలుసుకోవాలి. అలా చేస్తే జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
వాస్తవానికి ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి పశువుల యజమానులు దురాశతో టీకాలు వేస్తారు. అయితే ఈ పద్దతి పూర్తిగా చట్టవిరుద్ధం. అదే సమయంలో దేశంలో చాలా డైరీ ఫామ్‌లు ఉన్నాయి. అక్కడ ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి పశువులకు ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్‌లను ఇస్తున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ నిషేధించారు. కానీ చాలా మంది పాడి రైతులు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పశువుల యజమానులు, డెయిరీ ఫామ్ యజమానులు అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే నిబంధన ఉందని తెలుసుకోవాలి.
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అంటే ఏమిటి..?
పశువులు గర్భం దాల్చినపుడు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇస్తారు. దీనివల్ల అసహజంగా పాలు పెంచడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది పాల గ్రంధులలో ప్రేరణను పెంచుతుంది. చాలా మంది పాల వ్యాపారులు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. జంతువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు ఉన్నాయి.