ప్రయోగాత్మక సాగుకు తెరలేపిన రిటైర్డ్ టీచర్

Black Rice Cultivation: సిక్కోలు జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ ప్రయోగాత్మక సాగుకు తెరలేపారు.

Update: 2021-11-10 10:28 GMT

ప్రయోగాత్మక సాగుకు తెరలేపిన రిటైర్డ్ టీచర్

Black Rice Cultivation: సిక్కోలు జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ ప్రయోగాత్మక సాగుకు తెరలేపారు. స్థానికంగా సాగులో లేని దేశీయ వరి వంగడమైన కాలాబట్టిని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా మిగతా రైతులు దొడ్డు, సన్న తెల్ల వరి రకాలు సాగు చేస్తుంటే ఈ రైతు మాత్రం అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో నల్లవరి సాగుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తున్నారు.

పండిస్తున్న ధాన్యం వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందిస్తోందా? మరి వైద్యులెందుకు తెల్ల బియ్యం తినొద్దంటున్నారు? నిజంగా తెల్ల బియ్యం తినడం వల్లనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? ఈ ప్రశ్నలే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, తురువకశాసనం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ రైతు అయిన మాధవరావు గారిని ఆలోచింపజేశాయి. రైతులుగా మనమెందుకు ఆరోగ్యకరమైన ధాన్యాన్ని పండించలేమని ఆలోచించారు. పోషకాలు, ఖనిజలవణాలు అధికంగే ఉండే నల్ల బియ్యం విశిష్టతను తెలుసుకుని తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం పంట ఎదుగుదలను చూస్తూ మురిసిపోతున్నారు.

పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించే పంట సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. ఆవు వ్యర్ధాలను సేకరించి ఎరువుగా మార్చుకుని పంట పండిస్తున్నారు. ప్రకృతి విధానాలు కావడం వల్ల వరిలో ఇప్పటి వరకు ఎలాంటి చీడపీడల సమస్యలు కనిపించలేదని రైతు మాధవరావు తెలిపారు. అంతే కాకుండా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. తన సాగు సక్సెస్‌ అయితే తోటి రైతులకు నల్ల వరి సాగుపైన అవగాహన కల్పిస్తానంటున్నారు ఈ అభ్యుదయ రైతు.

సాధారణ తెల్ల వరి రకాలకు ఈ దేశీయ నల్ల వరి వంగడానికి చాలా వ్యత్యాసం ఉంటుందని రైతు చెబుతున్నారు. నల్ల వరి పంట చేతికి అందడానికి 140 నుంచి 150 రోజులు పడుతుందని తెలిపారు. నల్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, కాన్సర్‌ వంటి వాటని అదుపులో ఉంచుకోవచ్చు. విటమిన్లు, ఖనిజలవనాలు ఇందులో పుష‌కలంగా లభిస్తాయంటున్నారు. నల్ల వరి క్షేత్రం సమీప ప్రాంతాలవారందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. చాలా మంది రైతులు వరి పంటను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. రైతు సాగు అనుభవాలను తెలుసుకుంటున్నారు. 

Full View


Tags:    

Similar News