అజోల్లా... నీటి మీద తేలూతూ పెరిగే నాచులాగా ఉంటుంది. పంట సాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువులుగా ఉపయోగపడుతుంది. నేలకు కావాల్సిన నత్రజని, ఇతర పోషకాలను అందిస్తుంది రైతు నేస్తంగా ఉంటంది. కేవలం పచ్చిరొట్టి ఎరువుగా, జీవన ఎరువుగా మాత్రమే కాకుండా ప్రత్యామ్మాయ పశువుల దాణాగా కూడా ఉపయోగపడే అజోల్లా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీవన ఎరువుగా, అజోల్లా వాతావరణంలో గల నత్రజనిని స్థిరీకరించి ఆకులలో నిల్వ చేసుకుంటుంది, కాబట్టి దీనిని పచ్చి రొట్టె ఎరువుగా ఉపయోగిస్తారు. వరి పొలంలో అజోల్లా ఉపయోగించడం వల్ల, వరి దిగుబడి 20% పెరుగుతుందని గమనించబడింది. అజోల్లాలో ప్రోటీన్,కాల్షియం, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అడవిలో సులభంగా పెరుగుతుంది , నియంత్రిత పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఖరీఫ్ , రబీ, ఈ రెండు సీజన్లో ఇది పచ్చి రొట్టె ఎరువుగా పెద్ద పరిమాణంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. ఇది వాతావరణలోని కార్బన్ డైయాక్సైడ్ ను నత్రజని లాగా మారుస్తుంది, అంతేకారుండా కుళ్ళిపోయిన తరువాత, పంటకు కావలసిన నత్రజనిగా మారుతుంది.
కిరణజన్య సంయోగక్రియ కారణంగా ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్ పంటల మూల వ్యవస్థ శ్వాసక్రియతో పాటు ఇతర నేల సూక్ష్మజీవుల శ్వాసక్రియకు సహాయపడుతుంది. ఇది జింక్, ఐరన్ మరియు మాంగనీస్ లను కరిగించి వరి మొక్కలకు అందుబాటులో ఉంచుతుంది. అజోల్లా వరి పొలంలో చారా, నిటెల్లా వంటి లేత కలుపు మొక్కలను అణిచివేస్తుంది, వరి మొక్కల పెరుగుదలను మెరుగుపరిచే ప్లాంట్ గ్రోత్ రెగ్యూలేటర్స్ మరియు విటమిన్లను విడుదల చేస్తుంది. అజోల్లా కొంతవరకు రసాయన నత్రజని ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది మరియు ఇది పంట దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది.
పచ్చిరొట్టి ఎరువుగా, జీవన ఎరువుగా మాత్రమే కాకుండా ప్రతయమ్మాయ పశువుల దాణాగా కూడా చాలా ప్రాముఖ్కాత సంతరించుకుంది. అలాగే పశువుల దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజోల్లా వాడవచ్చని, దీనివలన నాణ్యత పెంచడమే కాకుండా పశువుల అర్యోగం వృద్ధి చెందుతుందని పరిశోధకుల మాట. అజొల్లాను దాణాగా వాడటం వలన దాణా ఖర్చు 20 - 25 శాతం తగ్గడమే కాకుండా వెన్న శాతం మరియు ఎస్.ఎన్.ఎఫ్. కూడా పెరగడం వలన పాలపై అధిక ఆదాయాన్ని పొందవచ్చు. గొర్రెలు,మేకలు, పందులు, కుందేళ్ళ, కోళ్ళ పెంపకంలో కూడా అజోల్లా మేతగా ఉపయోగపడుతుంది.