ఒకప్పుడు నవ్విన వారే ఇప్పుడు అదరహో అంటున్నారు

Update: 2020-05-18 11:11 GMT

ఆయనో రైతు... కాదు కాదు శాస్త్రవేత్త. పంట చేను కేంద్రంగా ప్రయోగాలు చేపట్టారు, ఆ పంటల ప్రయోగాన్ని కొందరు పిచ్చి అన్నారు. ‌ఆ భూములలో యాపిల్ సాగు అసాధ్యమన్నారు కాని అసాధ్యమన్న యాపిల్ పంటను సంకల్పంతో సుసాధ్యం చేశాడు ఆదిలాబాద్ రైతు. ఒకప్పుడు నవ్విన వారే ఇప్పుడు అదరహో అంటున్నారు. కుమ్రంబీమ్ జిల్లాలో యాపిల్ సాగు పై హెచ్ ఎంటీవీ స్పేషల్ గ్రౌండ్ రిపోర్ట్

యాపిల్ అంటే ఇప్పటి వరకూ మనకు జమ్మూ కశ్మీర్ లేదా సిమ్లా ప్రాంతాలలోనే దొరుకుతుందని తెలుసు యాపిల్ అంటేనే మన ఆలోచనలు ఆటోమేటిగ్గా కశ్మీర్ వైపు వెడతాయి అక్కడ తప్పితే ఆ పంట ఇంకెక్కడా పండదని అనుకుంటాం. కానీ ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే పంటను తెలంగాణలో పండించాలన్న ఒక రైతు సంకల్పం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కుమ్రంబీమ్ జిల్లా కెరిమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన‌ రైతు బాలాజీ మొదట పత్తి రైతు అయితే పత్తి పంట కొంత కాలంగా రైతులను నష్టాల పాల్జేస్తోంది. పుట్టెడు అప్పులతో పాడెక్కిస్తోంది. పాడెక్కించే పంటలు కాకుండా పసిడి వర్షం కురిపించే పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు

ఈ ప్రక్రియలో భాగంగా తనకున్న రెండు ఎకరాల భూమిలో అపిల్ సాగు చేపట్టాడు. నాలుగు వందల మొక్కలు నాటాడు ‌నాలుగు ఏళ్ల తర్వాత ఆ తోటలు ఇప్పుడు సిమ్లా, కాశ్మిర్ యాపిల్ తోటలను తలపిస్తున్నాయి. కంటికి రెప్పలా పంటను కాపాడటం వల్లే ఈ ‌ఫలితాలు వచ్చాయని ఆ రైతు అంటున్నారు. ఒక్కప్పుడు పిచ్చివాడు అని తీసి పారేసిన సాటి రైతులు ఇప్పుడు ప్రయోగాల రూపకర్తగా అభినందిస్తున్నారని రైతు బాలాజీ ఆనందం వ్యక్తం చేశారు

.అయితే యాపిల్ పంటకు పెద్దగా ఖర్చులేదు మొక్కలు ఒక్కొక్కటి రెండు వందల రుపాయలు ఉంటుందని, ఎరువులు, నాటడం అన్ని కలిపితే ఏకరాకు యాబై వేలు ఖర్చు మించదంటున్నాడు. పైగా ఒక్కసారిగా‌ మొక్కలు నాటితే ఇరవై సంవత్సరాల పాటు ఆదాయం వస్తుందని అంటున్నారు. ఎరువుల కోసం కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాను సేంద్రీయ ఎరువులే వాడినట్లు పత్తికి వినియోగించే ఎరువుల వ్యయం కంటే ఆపిల్ పంట కోసం వాడే ఎరువుల వ్యయం చాలా తక్కువ అంటున్నారు బాలాజీ. సర్కార్ ప్రోత్సహిస్తే యాపిల్ సాగులోఉమ్మడి ఆదిలాబాద్ కశ్మీర్ ను మరిపిస్తుందంటున్నారు రైతు బాలాజీ.

Full View


Tags:    

Similar News