PM Kisan: రైతులకి అలర్ట్.. బడ్జెట్ తర్వాత మరింత ప్రయోజనం..!
PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం త్వరలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం త్వరలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీంతోపాటు పీఎం కిసాన్‌కు సంబంధించి కూడా కొన్ని ప్రకటనలు వెలువడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో పిఎం కిసాన్ యోజన కింద రైతులకు అందుతున్న మొత్తాన్ని కేంద్రం పెంచవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద వార్షికంగా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆ అమౌంట్‌ని రూ.6,000 నుంచి రూ.8,000కి పెంచవచ్చునని చర్చలు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ యోజన ఒక అధికారి మాట్లాడుతూ "పిఎం కిసాన్ మొత్తం పెంచడం వల్ల రైతులందరికి లాభం జరుగుతుంది. అయితే ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలనే సూచనలు ఉన్నప్పటికీ ఆదాయ వ్యయాలను అరికట్టడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టడం అనేది సవాళ్లతో కూడుకున్నది. దీనివల్ల పెంపును పరిమితం చేయవచ్చని తెలిపారు.
ఒక్కో రైతుకు రూ.2,000 పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.22,000 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. దీనికింద ప్రతి రైతు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లింక్డ్ బ్యాంక్ ఖాతాకు సంవత్సరానికి రూ.6000 మూడు వాయిదాలలో బదిలీ అవుతాయి. పథకం ప్రారంభంలో లబ్ధిదారుల సంఖ్య 31 మిలియన్లు ఇప్పుడు 110 మిలియన్లకు పెరిగింది. పీఎం-కిసాన్ పథకం కింద నిరుపేద రైతులకు మూడేళ్లలో రూ.2 ట్రిలియన్లకు పైగా ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం రూ.68,000 కోట్లు కేటాయించింది.