Sunil Kumar: వ్యవసాయ భూములు.. బినామీలు చేయడానికి వీలులేదు
Sunil Kumar: సీలింగ్ చట్టాలను తప్పించుకోవడం కోసం ఆస్తి పన్నులను ఎగవేయడం కోసం బినామీ లావాదేవీలు జరపడం అనేది ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న అంశం.
Sunil Kumar: సీలింగ్ చట్టాలను తప్పించుకోవడం కోసం ఆస్తి పన్నులను ఎగవేయడం కోసం బినామీ లావాదేవీలు జరపడం అనేది ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న అంశం. దీని వల్ల ప్రభుత్వాలకు పన్ను నష్టమే కాకుండా నల్లధనం పేరుకుపోవడానికి కారణం అవుతుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో బినామీ లావాదేవీల నిషేధిత చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టానికి సమూల మార్పులు చేర్పులు చేసి 2016లో ఒక సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం మేరకు వ్యవసాయ భూములు ఎవరైనా సరే బినామీ లావాదేవీల ద్వారా కొనుగోలు చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా జరిపితే ఎలాంటి చర్యలు ఉంటాయి? ప్రభుత్వాలకు ఈ చట్టం ఎలాంటి అధికారాన్ని ఇచ్చింది? భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం.