UPSC Notification 2020: యూపీఎస్సీ 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
UPSC Notification 2020: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్త తెలిపింది.
UPSC Notification 2020: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 35 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. కాగా ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు సేకరణ ప్రక్రియ ఆగస్టు 22, 2020 నుంచి ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ద్వారా సెప్టెంబర్ 10, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 35
అసిస్టెంట్ ప్రొఫెసర్-24
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-7
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-3
రిసెర్చ్ ఆఫీసర్-1
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థఉలు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టుకు ఎంబీబీఎస్‌తోపాటు న‌్యూరాలజీలో పీజీ చేసి, మూడేండ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు హోమియోపతిలో డిగ్రీ చేసిఉండాలి.
రిసెర్చ్ ఆఫీసర్‌కు ఆంథ్రోపాలజీలో ఎండీ చేసి ఉండాలి, సోషల్ రిసెర్చ్‌లో మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు సైకాలజీ లేదా క్రిమినాలజీలో ఎండీ, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : రూ.25
దరఖాస్తులు ప్రారంభ తేది : ఆగస్టు 22, 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : సెప్టెంబర్ 10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsconline.nic.in/
విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.