ఐటీఐ విద్యార్థులకి బంపర్ ఆఫర్.. 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు..!

TSSPDCL Recruitment 2022: తెలంగాణలో నిరుద్యోగులకి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది...

Update: 2022-05-10 12:27 GMT

ఐటీఐ విద్యార్థులకి బంపర్ ఆఫర్.. 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు..! 

TSSPDCL Recruitment 2022: తెలంగాణలో నిరుద్యోగులకి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖ నోటి‌ఫి‌కే‌షన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లయ్‌ చేసుకోవచ్చు. త్వరలోనే ఇంటర్ అర్హతతో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగ ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ రాబోతున్నట్లు సమాచారం.

మొత్తం ఖాళీలు: 1271

అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్- 70

సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్- 201

జూనియర్ లైన్ మెన్- 1000

ముఖ్య సమాచారం:

అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్‌ చేసి ఉండాలి.

పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ విడుదల: మే 11, 2022

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: మే 11, 2022

Tags:    

Similar News