ఫుడ్‌ సేప్టీ అండ్ స్టాండర్స్‌లో ఉద్యోగవకాశాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..?

FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

Update: 2021-11-08 12:22 GMT

ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు (ఫైల్ ఇమేజ్)

FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్, ఐటీ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ఇతర పోస్టులు కలిపి 233 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్ FSSAI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 12 నవంబర్ 2021గా నిర్ణయించారు.

ఫుడ్ అనలిస్ట్ పోస్ట్ మినహా, ఇతర పోస్టులకు FSSAI కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తుంది. టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి పోస్టులకు రెండుసార్లు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇతర పోస్టుల కోసం ఒకేసారి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. 1:5 అభ్యర్థులను షార్ట్‌లిస్ట్/ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.

ఖాళీల వివరాలు

1. అసిస్టెంట్ డైరెక్టర్

2. అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్)

3. డిప్యూటీ మేనేజర్

4. ఫుడ్ అనలిస్ట్ (టెక్నికల్ ఆఫీసర్)

5. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (CFSO)

6. అసిస్టెంట్ మేనేజర్ (అసిస్టెంట్ మేనేజర్) (IT)

7. అసిస్టెంట్ మేనేజర్

8. అసిస్టెంట్

9. హిందీ అనువాదకుడు

10. పర్సనల్ అసిస్టెంట్

11. IT అసిస్టెంట్

12. జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్- 1)

ఎంపిక ప్రక్రియ

ఎంపిక అన్ని దశలలో పొందిన మార్కులు ప్రతి దశకు కేటాయించిన వెయిటేజీ ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో గైర్హాజరైన అభ్యర్థులు అర్హులు కాదు. చివరి దశలో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం కావాల్సిన అర్హత ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు. టై కొనసాగితే వయస్సులో పెద్ద అభ్యర్థికి ప్రాధాన్యత ఉంటుంది.

Tags:    

Similar News