IIT Hyderabad: బీటెక్ చదివిన వారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు..!
IIT Hyderabad: బీటెక్ చేసిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి...
IIT Hyderabad: బీటెక్ చేసిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి సీనియర్ రిసెర్చ్ ఫెలో, రెండోది సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, మూడది జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకునేవారు 40 ఏళ్లు దాటకూడదు. ఎంపికైన అభ్యర్థులకి నెలకి రూ.31,000 నుంచి రూ. 41, 000 వరకు చెల్లిస్తారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలని గుర్తుంచుకోండి.
ఇంటర్వూ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అడ్రస్ వచ్చేసి అకడమిక్ బ్లాక్స్, కంది క్యాంపస్, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ. దరఖాస్తులకి చివరి తేది మే 27, 2022గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఒక్కసారి నోటిఫికేషన్ పరిశీలించండి.