Indian Navy Recruitment: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు..దరఖాస్తుకు చివరి తేదీ 5 రోజులే
Indian Navy Recruitment: ఇంటర్, డిగ్రీ,ఐటీఐ,డిప్లొమా చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత నౌకాదళం 741 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నవారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.
ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ హోదాతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా సాంకేతిక సేవలకు చెంది ఉద్యోగాలే. అభ్యర్థులకు రాతపరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరంతా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు :
ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
ఛార్జ్ మ్యాన్ -1 పోస్టులు, చార్జ్ మ్యాన్ -10పోస్టులు, ఛార్జ్ మ్యాన్ -18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ -4 పోస్టులు
ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.
డ్రాఫ్ట్స్ మ్యాన్ 2 పోస్టులు, ఫైర్ మ్యాన్ 444 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 58 పోస్టులు, ట్రేడ్స్ మ్యాన్ మేట్ 161 పోస్టులు, పెస్ట్ కంట్రోల్ వర్కర్ 18 పోస్టులు, కుక్ 09 పోస్టులు, ఎంటిఎస్ 16 పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య 741
అర్హతలు:
పోస్టును బట్టి అభ్యర్థులు పదవ తరగతి, 12వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
సైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30ఏండ్లకు మించకూడదు. ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27ఏండ్ల లోపు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 -25 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3ఏండ్లు. దివ్యాంగులకు 10ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 5ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఆసక్తి, ఉన్నవారు 2024, ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.