DRDO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ ఏజెన్సీ డిఆర్డిఓ(డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటిఐ అప్రెంటిస్ విభాగంలో ఈ నియామకాలు జరగనున్నాయని వాటికోసం ఐటిఐలో ఉత్తీర్ణులై ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీలోని COPA విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7 వేలు, ఇతర ట్రేడ్ లలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,050 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటన చేశారు. తిమర్పూర్ లోని సంస్థలో 38 పోస్టుల ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు.
ఖాళీల వివరాలు :
మిషన్ మోటార్ వెహికిల్ - 3,
డ్రాట్స్ మాన్ - 4,
ఎలక్ట్రానిక్ మిషన్ - 5,
ఇన్ట్రుమెంట్ విషన్ మెకానిక్ - 6,
లాబరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్) - 6
కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) - 14
వయోపరిమితి :
వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు.
అన్ రిజర్వ్డ్ : 27 ఏళ్లు
ఓబీసీ : 30 ఏళ్లు,
ఎస్టీ, ఎస్సీ : 32 ఏళ్లు
చివరి తేదీ : ఆగస్టు 29
పూర్తి వివరాలకు : https://rac.gov.in