TS EAMCET 2020: సెప్టెంబర్‌లో ఎంసెట్!

TS EAMCET 2020: దేశంలో క‌రోనా విభృంభిస్తుంది. ఈ వైర‌స్ కట్టడిలో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Update: 2020-08-10 18:09 GMT

TS EAMCET 2020: దేశంలో క‌రోనా విభృంభిస్తుంది. ఈ వైర‌స్ కట్టడిలో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరంపై సమీక్షించారు.

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయని తెలిపారు. ఆగస్టు 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు.

అలాగే ఆగస్టు 31న ఈ సెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News