స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) 'టైర్-1' ఫలితాలు విడుదల!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామనేషన్ (సీజీఎల్‌ఈ)-2018 'టైర్-1' ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ (https://ssc.nic.in)లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

Update: 2019-09-13 05:10 GMT

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామనేషన్ (సీజీఎల్‌ఈ)-2018 'టైర్-1' ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ (https://ssc.nic.in)లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. టైర్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను వాటితో పాటు విభాగాల వారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

ఫలితాలు మూడు జాబితాలుగా ఫలితాలను వెల్లడించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మొదటి జాబితాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (కాగ్ మినహాయించి), రెండో జాబితాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (కాగ్‌లో) పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఇక మూడో జాబితాలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 7 నుంచి 11 వరకు సీజీఎల్ 'టైర్-1' పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది. సెప్టెంబరు 12న ఫలితాలను వెల్లడించింది. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు చివరివారంలో 'టైర్-2' పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక టైర్-2లో అర్హత సాధించిన వారికి టైర్-3లో స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

DEO (Other than C&AG) Result ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి. 

DEO (C&AG) Result ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

LDC/ JSA, PA/ SA Results ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

Cut-off Marks ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.


Tags:    

Similar News