Nlc India Recruitment 2020: దేశంలో ఎంతో మంది యువతీ యువకులు ఉద్యోగులు లేక ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు ఎన్ఎల్‌సీ ఓ మంచి శుభవార్త తెలిపింది. భారత ప‌్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 75 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 10 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.nlcindia.com/ వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వొచ్చు.
మొత్తం అప్రెంటిస్ ఖాళీల: 75
ఎలక్ట్రిషన్- 20
ఫిట్టర్ ఫ్రెషర్- 20 ఖాళీలు
వెల్డర్- 20
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ)- 10
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియాలజీ)- 5
దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్‌లో చేసుకోవలసి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 25న
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 10న
విద్యార్హత
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
ఉపకార వేతనం
నెలకు రూ.8,766 నుంచి రూ.10,019
పూర్తివివరాల్ కోసం :
వెబ్‌సైట్: https://www.nlcindia.com/