JEE Main 2020: జేఈఈ మెయిన్స్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

జేఈఈ మెయిన్స్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే ఫిబ్రవరి 7వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2020-02-07 11:42 GMT

జేఈఈ మెయిన్స్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే ఫిబ్రవరి 7వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్- jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 7 వ తేదీన ముగియనున్నాయి. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ మాధ్యమాల్లో నిర్వహించబడుతుంది.

కావలసిన ధృవీకరణ పత్రాలు..

♦ 10వ తరగతి మార్కుల జాబితా.

♦ ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష మార్కుల జాబితా.

♦ డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు సర్టిఫికేట్ / మార్క్ షీట్,

♦ అభ్యర్థి పాస్ పోర్ట్ సైజ్ పాస్ ఫోటో

విద్యార్హత:

♦ ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

♦ ప్రస్తుతం 2020 మార్చిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.

♦ ఇప్పటి వరకూ ఈ ప్రవేశ పరీక్ష రాయకుండా ఉన్న వారు, లేదా ఐఐటి, జెఇఇ రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసిన వారు.

దరఖాస్తు రుసుము:

♦ జనరల్ ఓబీసీ పురుష అభ్యర్థులు 500 చెల్లించాల్సి ఉంటుంది.

♦ మహిళా అభ్యర్థులు రూ .250 సమర్పించాల్సి ఉంటుంది.

♦ మరిన్ని వివరాను జేఈఈ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చును.

Tags:    

Similar News