ఇంటర్ మీడియట్ విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు ప్రత్యేక యాప్

ఈ విద్యాసంవత్సరంలో జరగబోయే ఇంటర్ మీడియెట్ పరీక్ష నిర్వహణకు ఇంటర్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Update: 2020-02-29 08:22 GMT

ఈ విద్యాసంవత్సరంలో జరగబోయే ఇంటర్ మీడియెట్ పరీక్ష నిర్వహణకు ఇంటర్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్ధుల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియెట్ ఎడ్యుకేషన్ (TSBIE) TSBIE ఎం సర్వీసెస్ యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా హాజరు కాకుండా ఉండడం కోసం పరీక్ష సెంటర్ ను కనుగొనెలా రూపొందించారు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇస్టాన్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థులు ఇన్ స్టాల్ చేసుకోవలసిందిగా ఇంటర్ బోర్టు విద్యార్థులకు సూచించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించ వచ్చని తెలిపారు.

ఇక పోతే పరీక్షలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో విద్యార్థులు కూడా పరీక్షలను రాసేందుకు సంసిధ్దంగా అయ్యారు. ఈ పరీక్షలు మార్చి 4న మొదలయి, మార్చి 18 వరకూ ఇవి కొనసాగనున్నాయి. ఈ పరీక్షను ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక పోతే ఈ పరీక్షలకు ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 4,80,516 మంది, ద్వితీయ సంవత్సనం నుంచి 4,85,323 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు గాను తెలంగాణలో మొత్తం 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష మొదలవ్వడానికి 1గంట ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని తెలిపారు.

ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను శుక్రవారం మధ్యానం నుంచి tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఆ సైట్‌లోకి వెళ్లి... హాల్ టికెట్లు డౌన్‌లోడ్ ఆప్షన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా బోర్డులో 040-24600110 నంబర్‌తో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

ఇక పోతే ఇంటర్ బోర్డు ఛీఫ్ సెక్రటరీ చిత్ర రమాచంద్రన్ విద్యార్థులను ఉధ్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సెంటరుకు సరైన సమయానికి చేరుకోవాలంటే రెండు గంటల ముందునుంచే ఇంటి నుంచి బయలు దేరాలని అన్నారు. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకు పోయినప్పటికీ ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు సరిగ్గా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని తెలిపారు. 

Tags:    

Similar News