IIIT's Admissions: ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ ఎలా? మూడు ప్రతిపాదనలు తెరపైకి

IIIT's Admissions: కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని పరీక్షలు వాయిదా పడగా, మరికొన్నింటికి జరపకుండా విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ చేశారు.

Update: 2020-07-30 05:12 GMT
IIIT ADMISSIONS

IIIT's Admissions: కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని పరీక్షలు వాయిదా పడగా, మరికొన్నింటికి జరపకుండా విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే పబ్లిక్ అయినటువంటి పదో తరగతికి సంబంధించి పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేశారు. దీంట్లో వచ్చిన మార్కుల ఆదారంగా ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ఇచ్చేవారు, ఈ ఏడాది అలా కాకుండా పరీక్షలు లేకుండా పాస్ చేయడం వల్ల ఏ ప్రాతిపదికన వీటిల్లో అడ్మిషన్లు చేయాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. దీనిపై ఇప్పటికే మూడు ప్రతిపాదనలు తయారు చేసిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ వాటిలో ఒక దానిపై ఆమోదం కోసం ప్రభుత్వం ముందుంచింది.

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ధాటికి చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యా సంవత్సరపు అడ్మిషన్లను ఏ ప్రాతిపదికపై చేపట్టాలన్న దానిపై 'రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)' ప్రధానంగా మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.

కరోనా సంక్షోభ సమయం కాబట్టి, 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్‌ పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకోవడం మొదటి ఆప్షన్‌. గత ఏడాది (2018-19)లో ఆయా విద్యార్థుల పెర్ఫార్మెన్స్‌ను ప్రాతిపదికగా తీసుకోవడం రెండో పద్ధతి. ఇక ఈ రెండు పద్ధతులు అమలు కాని పక్షంలో.. అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్‌ను నిర్ణయించడం మూడో ఆప్షన్‌. ఈ మూడు పద్ధతులను ప్రభుత్వం ముందుంచి తుది నిర్ణయానికి రావాలన్న యోచనలో ఆర్‌జీయూకేటీ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News