Coronavirus Effect and Lockdown: 30శాతం సిలబస్ కట్ చేసిన CBSE

Coronavirus Effect and Lockdown: కరోనా వైరస్ రోజు రోజు విస్తరిస్తున్న క్రమంలో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా ఆగమైంది.

Update: 2020-07-07 13:45 GMT

Coronavirus Effect and Lockdown: కరోనా వైరస్ రోజు రోజు విస్తరిస్తున్న క్రమంలో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా ఆగమైంది. వేసవి సెలవులు పూర్తి చేసుకుని జూన్ నెలలో మొదలు కావల్సిన పాఠశాలలు కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పటి వరకు కూడా తెరుచుకోలేదు. ప్రతి ఏడాది ఈ సమయానికి కొత్త అడ్మిషన్లతో, కొత్త పుస్తకాలు, కొత్త క్లాసులతో విద్యార్థుల హడావుడితో సందడిగా ఉండే పాఠశాలలు, విద్యాసంస్థలు ఈ ఏడాది వెలవెల బోతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు పాఠశాలలు మూతపడే ఉంటాయో, పాఠాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఈ ఏడాది వెనకబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. అంతే కాక పాఠశాలల్లో పనిదినాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.

9 నుంచి 12వ తరగతుల విద్యార్ధులకు 2020-21 విద్యా సంవత్సరంలో 30 శాతం సిలబస్ కట్ చేస్తున్నట్లు CBSE అధికారికంగా తెలిపింది. ఈ విధంగా సిలబస్ తగ్గించడం ద్వారా ఈ విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలాగే విద్యార్ధుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలిపారు. సిలబస్‌లో లేని పాఠాలు కేవలం విద్యార్థులకు బోధిస్తామని కానీ వాటిపై అసైన్మెంట్స్, బోర్డు పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వమని సీభీఎస్ స్పష్టం చేసారు. ఇక మార్పులతో కూడిన సిలబస్‌ను సర్క్యులమ్ కమిటీ ఫైనల్ చేసిందని కూడా సీబీఎస్ఈ తెలిపింది.




Tags:    

Similar News