Coal India Recruitment 2020: నిరుద్యోగులకు కోల్ ఇండియా శుభవార్త తెలిపింది. 2305 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో 2305 ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోల్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకనే ఔత్సాహికులకు పోస్టులను బట్టి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా తదితర విద్యార్హతలను నిర్ణయించింది. ఆయా పోస్టులకు ఆయా విద్యార్హతలు గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.పూర్తి నోటిఫికేషన్ వివరాలకు http://nclcil.in/ లేదా https://www.coalindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆసక్తి గల వాళ్లు సంబంధిత వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, పోస్టుల సంఖ్య, పని ప్రదేశం తదితర వివరాలు కింద పేర్కొనబడ్డాయి.
1. అప్రెంటిస్ విభాగంలో మొత్తం 1500 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత - ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
పని ప్రదేశం - సింగ్రౌలిలో చేయవలసి ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్టు 16, 2020
2. టెక్నీషియన్ విభాగంలో మొత్తం 433 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత ఐటీఐ ఉత్తీర్ణలై ఉండాలి.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్టు 25, 2020
3. ఓవర్‌సీర్ విభాగంలో మొత్తం 23 ఖళీలు ఉన్నాయి.
విద్యార్హత - డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
విధులు రాంచీలో నిర్వహించవలసి ఉంటుంది.
దరఖాస్తునకు చివరితేదీ : జులై 30, 2020
4. అసిస్టెంట్ ఫోర్‌మెన్ విభాగంలో మొత్తం 79 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత : డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 25, 2020