CLAT - 2020 ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

Update: 2019-12-24 05:09 GMT

లా చదవాలనుకున్న విద్యార్థల కోసం జాతీయస్థాయిలో న్యాయవిద్య కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మే 10న క్లాట్-2020 పరీక్ష నిర్వహించనున్నారు. దీనిద్వారాఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం)తోపాటు , అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. క్లాట్ ద్వారా 21 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. ఈ నోటిఫికేషన్ను కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2020 ప్రవేశ పరీక్ష షెడ్యూలును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 11న వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలును విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి.

ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే మే 12 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. అనంతరం మే 18న ఫైనల్ ఆన్సర్ కీని వెల్లడిస్తారు. ఇక మే 24న క్లాట్ తుది ఫలితాలను వెల్లడించనున్నారు.

కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2020

కోర్సులు : అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

కోర్సు వ్యవధి : 5 సంవత్సరాలు.

విద్యార్హతలు : క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వారితో పాటు ఈ ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ ) చేయాలనుకున్నవారు. క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి‌. ఈ ఏడాది ఏప్రిల్/ మేలో లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా అర్హులు.

కోర్సు వ్యవధి: ఏడాది. ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్లాట్‌-2019) ద్వారా.

01.01.2020 : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

31.03.2020 : దరఖాస్తుకు చివరితేది

31.03.2020 : క్లాట్ 2020 పరీక్ష తేది

11.05.2020 : ప్రాథమిక 'కీ' విడుదల

12.05.2020 - 15.05.2020 : 'కీ'పై అభ్యంతరాల స్వీకరణ

18.05.2020 : ఫైనల్ ఆన్సర్ కీ

24.05.2020 : తుది ఫలితాల వెల్లడి

Tags:    

Similar News