CAT 2020 schedule: CAT 2020 నోటిఫికేషన్ విడుదల
CAT 2020 schedule: విద్యార్ధులకు క్యాట్ శుభవార్త తెలిపింది. ఐఐఎంలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది.
cat 2020 schedule : విద్యార్ధులకు క్యాట్ శుభవార్త తెలిపింది. ఐఐఎంలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆరువందలకు పైగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో విద్యార్ధుల ప్రవేశంకోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది క్యాట్ పరీక్షను ఐఐఎం ఇండోర్ నిర్వహించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 5న ప్రారంభమయి, సెప్టెంబర్ 16, 2020 ముగుస్తాయని తెలిపింది. ప్రవేశ పరీక్ష నవంబర్ 29, 2020న నిర్వహించనున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు అక్టోబర్ 28 నుంచి పరీక్ష తేదీవరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు క్యాట్‌కు సంబంధించిన వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్ https://iimcat.ac.in/ లో ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఐఐఎం ఇండోర్ నిర్వహించే క్యాట్ పరీక్షలు మూడు విభాగాలు ఉంటాయని తెలిపింది. పరీక్ష మొత్తం మూడు గంటలపాటు ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ఏడాది ఈ ప్రవేశపరీక్షకు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆగస్టు 5, 2020న దరఖాస్తులు ప్రారంభం
సెప్టెంబర్ 16, 2020 దరఖాస్తుకు చివరి తేదీ
అక్టోబర్ 28, 2020 నుంచి అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం
నవంబర్ 29, 2020 పరీక్ష తేదీ
వెబ్‌సైట్: https://iimcat.ac.in/