AICTE Pragati Scholarship : బీటెక్, డిప్లొమా అమ్మాయిలకు ఏడాదికి రూ.50 వేల స్కాలర్‌షిప్
AICTE Pragati Scholarship : బీటెక్, పాలిటెక్నిక్ చదివే ప్రతిభావంతులైన పేద విద్యార్థినులకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి శుభవార్త తెలిపింది.
AICTE Pragati Scholarship : బీటెక్, పాలిటెక్నిక్ చదివే ప్రతిభావంతులైన పేద విద్యార్థినులకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది పేద విద్యార్ధినులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) 'ప్రగతి' పథకం కింద అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను ఈ ఏడాది భారీగా పెంచింది. ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా 2000 వేలమంది పాలిటెక్నిక్ విద్యార్థినులకు అలాగే 2000 వేల మంది బీటెక్ విద్యార్థినులకు 2014-15 విద్యా సంవత్సరం నుంచి స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. అయితే ఈ విద్యాసంవత్సరం అంటే 2020-21 నుంచి ఏఐసీటీఈ స్కాలర్ షిప్ ల సంఖ్యను 4వేల నుంచి 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ సహస్రబుద్ధే తెలిపారు. కాగా ఒక్కో విద్యార్ధికి ఏ పథకం కింద ఏడాదికి రూ.50 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇందులో 5 వేలు బీటెక్ విద్యార్థినులకు, మరో 5 వేలు డిప్లొమా విద్యార్థినులకు.
ప్రగతి స్కాలర్‌షిప్ వివరాలు:
ఎంపిక: ఏఐసీటీఈ సంబంధిత కాలేజీలో బీటెక్/పాలిటెక్నిక్‌లో చేరడానికి నిర్వహించే క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత : ఏఐసీటీఈ గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్/ డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి. వివాహం జరిగిన పక్షంలో తల్లిదండ్రులు/అత్తమామ రెండు కుటుంబాల్లో ఎవరి వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షలు దాటకూడదు. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పటికీ ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది.
స్కాలర్‌షిప్ : ట్యూషన్ ఫీజు కింద రూ.30 వేలు ఇస్తారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్/ పుస్తకాలు/ వాహనం వంటి వాటిని కొనుగోలు చేయడానికి రూ.30 వేలు ఇస్తారు. అలాగే కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ప్రతి సంవత్సరం (10 నెలలు) నెలకు రెండు నెలలు చొప్పున రూ.20 వేలు ఇస్తారు.
వివరాలకు వెబ్‌సైట్:https://www.aicte-pragati-saksham-gov.in/ లేదా https://www.aicte-india.org/schemes/students-development-schemes