SBI PO Officer: ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం ఎలా ఉంటుంది.. జీతభత్యాలు, అలవెన్సుల పూర్తి వివరాలు..!

SBI PO Officer: బ్యాంకులో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ సరైన జాబ్‌.

Update: 2023-09-27 08:30 GMT

SBI PO Officer: ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం ఎలా ఉంటుంది.. జీతభత్యాలు, అలవెన్సుల పూర్తి వివరాలు..!

SBI PO Officer: బ్యాంకులో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ సరైన జాబ్‌. ఇది బ్యాంకింగ్‌ రంగంలో అత్యంత డిమాండ్‌ ఉన్న ఉద్యోగం. మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ జీతం, అలవెన్సులు, సౌకర్యాలు లభిస్తాయి. ఒకసారి ఎస్బీఐ పీవోగా ఎంపికైతే కెరీర్‌లో చివరి వరకు సీఈవో వరకు వెళ్లవచ్చు. అంతేకాదు విదేశీ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా అవకాశం లభిస్తుంది. ఎస్బీఐ పీవో ప్రారంభ వేతనం రూ. 41,960 వీటికి అదనంగా వైద్య బీమా, ప్రయాణ భత్యం, హెచ్‌ఆర్‌ఏ మొదలైన అలవెన్సులు ఉంటాయి.

ఎస్బీఐ పీవో అర్హత

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. ముందుగా భారతదేశ పౌరుడై ఉండాలి.18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల/ నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రి కలిగి ఉండాలి. చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా అర్హులే. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించినట్లుగా రుజువు చూపించాలి.

ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్

ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ సిలబస్ మూడు విభాగాలుగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి.

ఎస్బీఐ పీవో మెయిన్స్

ఎస్బీఐ పీవో పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రెటేషన్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం 155 ప్రశ్నలు ఉంటాయి. వీటి వెయిటేజీ 200 మార్కులు. ఇందులో 50 మార్కుల చొప్పున 2 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు కూడా ఉంటాయి.

ఎస్బీఐ పీవో ప్రయోజనాలు

ఎస్బీఐ పీవోగా నియమితులైన అభ్యర్థులు వివిధ ప్రోత్సాహకాలు, ప్రయోజనాలతో పాటు ఆకర్షణీయమైన జీతం, ప్యాకేజీలు పొందుతారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎస్బీఐ పీవో వార్షిక వేతనం జాబ్ పోస్టింగ్ స్థలాన్ని బట్టి రూ. 8.20 లక్షల నుంచి రూ.13.08 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News