UGC NET Exam: యూజీసీ నెట్‌ క్వాలిఫై అవ్వలేకపోతున్నారా.. ఈ ప్రత్యామ్నాయ ఎంపికలపై దృష్టిపెట్టండి..!

UGC NET Exam: చాలామంది విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తయ్యాక రీసెర్చ్‌ వైపు వెళ్లాలనుకుంటారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతారు.

Update: 2024-01-27 10:31 GMT

UGC NET Exam: యూజీసీ నెట్‌ క్వాలిఫై అవ్వలేకపోతున్నారా.. ఈ ప్రత్యామ్నాయ ఎంపికలపై దృష్టిపెట్టండి..!

UGC NET Exam: చాలామంది విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తయ్యాక రీసెర్చ్‌ వైపు వెళ్లాలనుకుంటారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతారు. ఈ పరీక్ష క్వాలిఫై అయితే యూనివర్సిటీలు, కాలేజ్‌ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయవచ్చు. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపికైతే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో రీసెర్చ్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం స్కాలర్ షిప్‌ కూడా అందిస్తుంది.

యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి అప్పగించింది. యూజీసీ-నెట్‌ పరీక్ష పేపర్-I, పేపర్-IIలో అభ్యర్థికి వచ్చిన మొత్తం మార్కులపై ఆధారపడి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు మాత్రమే అర్హత సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎంపికవ్వరు. కాబట్టి యూజీసీ-నెట్‌కు క్వాలిఫై అవ్వకపోతే జీవితంలో సక్సెస్‌ కామని కొంత మంది భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో యూజీసీ-నెట్‌ క్లియర్ చేయలేని అభ్యర్థులకు కొన్ని ప్రత్యామ్నాయ ఎంపికలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అభ్యర్థులు యూపీఎస్సీ, సీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌, బ్యాంక్ పరీక్షలు మొదలైన వివిధ ప్రభుత్వ పరీక్షలను ట్రై చేయవచ్చు. ఉన్నత విద్యావంతులకు కార్పొరేట్‌ రంగంలో అవకాశాలు చాలా ఉన్నాయి. అభ్యర్థులు కంటెంట్ రైటింగ్, అనువాదం, జర్నలిజం మొదలైన ఉద్యోగ పాత్రలలో ఉపాధి పొందవచ్చు. చాలా మంది యూజీసీ-నెట్‌ క్లియర్ చేయడంలో ఫెయిల్‌ అయిన తర్వాత కోచింగ్‌ సెంటర్లు ఓపెన్‌ చేస్తారు. వీటిద్వారా ఉపాధి పొందవచ్చు. అంతేకాదు బోధనా రంగంలో వృత్తిని కొనసాగించాలనుకునే వారు పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజ్‌ల్లో టీచింగ్‌లో జాయిన్‌ కావచ్చు. అయితే ఇందుకోసం అభ్యర్థులు తప్పనిసరిగా బీఈడీ చేసి పొందాలి.

Tags:    

Similar News