ఇంజనీరింగ్‌ విద్యార్థులకి శుభవార్త.. ఈ జాబులని అస్సలు వదిలిపెట్టకండి..!

TSPSC Recruitment 2022: ఇంజనీరింగ్‌ విద్యార్థులకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2022-09-13 09:30 GMT

ఇంజనీరింగ్‌ విద్యార్థులకి శుభవార్త.. ఈ జాబులని అస్సలు వదిలిపెట్టకండి..!

TSPSC Recruitment 2022: ఇంజనీరింగ్‌ విద్యార్థులకి ఇది శుభవార్తనే చెప్పాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 833 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్‌ (434), జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (399) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ.

పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, పబ్లిక్‌హెల్త్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకైతే నెలకు రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు చెల్లిస్తారు. ఇక జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.32,810ల నుంచి రూ.96,890ల వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర వివరాలకి అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

Tags:    

Similar News