నిరుద్యోగులకి సువర్ణవకాశం.. రవాణా శాఖలో ఉద్యోగాలు..!

TSPSC Recruitment 2022: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)రాష్ట్రంలోని రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Update: 2022-08-01 13:30 GMT

నిరుద్యోగులకి సువర్ణవకాశం.. రవాణా శాఖలో ఉద్యోగాలు..!

TSPSC Recruitment 2022: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)రాష్ట్రంలోని రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 113 పోస్టులు భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 5 ఆగస్టు

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 5 సెప్టెంబర్

మొత్తం పోస్టుల సంఖ్య – 113

అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (3 సంవత్సరాల కోర్సు) కలిగి ఉండాలి. హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు పరిమితి 21 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము రూ. 200, పరీక్ష రుసుము రూ. 120. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజు చెల్లింపు కేవలం ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT), ఆఫ్‌లైన్ OMR ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News