Group 2: నిరుద్యోగులకి అలర్ట్‌.. గ్రూప్‌ 2 సిలబస్‌, పేపర్‌ సరళి గమనించారా..!

Group 2: తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగుల కోసం వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

Update: 2022-08-31 15:30 GMT

Group 2: నిరుద్యోగులకి అలర్ట్‌.. గ్రూప్‌ 2 సిలబస్‌, పేపర్‌ సరళి గమనించారా..!

Group 2: తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగుల కోసం వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 80వేల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్స్‌ వంటి నోటిఫికేషన్లని విడుదల చేసింది. తాజాగా గ్రూప్‌ 2, 3 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. అయితే అత్యధిక పోటీ ఉండే గ్రూప్‌ 2 ఉద్యోగాలకి అభ్యర్థులు సిలబస్‌, పరీక్ష విధానం గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గ్రూప్‌ 2 పోస్టులు మొత్తం 663 ఉన్నాయి. ఈ సారి దాదాపు 5 నుంచి 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే చాలా మందికి సిలబస్, పరీక్షా విధానంపై అవగాహన ఉండదు. గ్రూప్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కి 150 మార్కులు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ II కు సంబంధించి చరిత్ర, రాజకీయాలు, సమాజం, పేపర్ III కి సంబంధించి ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్, పేపర్ IVకి సంబంధించి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం ఉంటాయి.

ఈ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతీ పేపర్ కు 2.30 గంటల సమయం ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అయితే గ్రూప్ I, గ్రూప్ II, గ్రూప్ III, గ్రూప్ IV అన్ని పరీక్షలలో పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. కానీ సర్వీస్ స్థాయిని బట్టి సబ్జెక్ట్ వెయిటేజీ మారుతుంది. త్వరలో విడుదలయ్యే గ్రూప్ నోటిఫికేషన్‌లో మొత్తం 663 పోస్టులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జీఏడీ ఏఎస్‌వో పోస్టులు-165, పంచాయతీరాజ్ ఎంపీవో పోస్టులు-125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు- 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు- 97 ఉన్నాయి.

Tags:    

Similar News