TSPSC Group-2 Exam: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై క్లారిటీ వచ్చేసింది..!

TSPSC: తెలంగాణ‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగష్టు 29, 30తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

Update: 2023-07-31 06:55 GMT

TSPSC Group-2 Exam: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై క్లారిటీ వచ్చేసింది..!

TSPSC: తెలంగాణ‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగష్టు 29, 30తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు రాసే కొందరు అభ్య‌ర్థులు మాత్రం ఈ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని జూలై 24వ తేదీన ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ వాయిదా పడుతుందా? లేదా? అన్న ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. పరీక్షను వాయిదా వేసే అవకాశమే లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు.

దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు. మరోవైపు గ్రూప్‌-1 మెయిన్స్‌ తేదీల ఖరారు టీఎస్‌పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇటువంటి తరుణంలో మరో ప్రధాన పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ ఏకాభిప్రాయానికి వచ్చింది.

Tags:    

Similar News