మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు..!

Extension Officer: రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

Update: 2022-08-31 11:46 GMT

మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు..!

Extension Officer: రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌ 1, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైలు, కానిస్టేబుల్‌, సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్స్‌ వంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్‌-1 ఎక్స్‍టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకి వచ్చే నెల 8 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్‌‍ సర్వీస్మెన్‌కు మూడేండ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్టు వివరించారు. వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాళేశ్వరం-26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 26, యాదాద్రి- 21, చార్మినార్‌- 21, జోగులాంబ- 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు హోమ్‌ సైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/బోటనీ/జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ/అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్/బోటనీ/క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్/బయో కెమిస్ట్రీ/ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్/జువాలజీ/బోటనీ అండ్‌ కెమిస్ట్రీ/బయోలాజికల్‌ కెమిస్ట్రీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ ఉద్యోగాలకి ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 150 ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ విభాగం నుంచి వస్తాయి. పేపర్‌-2లో సంబంధిత డిగ్రీ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 300 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 300 మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఇది అరుదుగా వచ్చే నోటిఫికేషన్.

Tags:    

Similar News