TS Police Jobs 2022: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచి పార్ట్ 2 అప్లికేషన్లు ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు కీలకం..
TS Police Jobs 2022: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచి పార్ట్ 2 అప్లికేషన్లు ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు కీలకం..
TS Police Jobs 2022: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ రాతపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో సమర్పించే ప్రక్రియ గురువారం (అక్టోబర్ 27) నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో అభ్యర్ధులు ముందుగా అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవల్సి ఉంటుంది. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్ధులందరూ తదుపరి దశగా పలిచే 'పార్ట్-2'గా పిలిచే ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసేందుకు అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు అవకాశం ఇచ్చింది.
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంతో స్థానికత అంశం కీలకంగా మారింది. ఈమేరకు తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95% ఉద్యోగావకాశాలుండటంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగానే పరిగణించనున్నారు. అప్పుడు కేవలం 5% నాన్‌లోకల్ కోటాలోనే పోటీపడాల్సి వస్తుంది. కుల ధ్రువీకరణపత్రాలు సమర్పించడంలో విఫలమైతే జనరల్ కేటగిరీగానే పరిగణనలోకి తీసుకుంటారు.
అప్‌లోడ్ చేయవల్సిన సర్టిఫికెట్లు ఇవే..
1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నేటివ్ సర్టిఫికెట్, పుట్టినతేదీ నిర్ధారణకు పదో తరగతి మార్కుల షీటు, డిగ్రీ మార్కుల షీటు, ఇంటర్ మార్కుల షీటు, కుల సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులకు 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్, సర్వీస్ సర్టిఫికెట్, మాజీ సైనికోద్యోగులు/ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా డిశ్ఛార్జి బుక్.