TS TET 2022 Result: జులై 1న టెట్ ఫలితాలు విడుదల
TS TET 2022 Result: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది.
TS TET 2022 Result: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుదల చేయాలని ఆమె ఆదేశించారు.