TS Police Jobs 2022: కానిస్టేబుల్ పోస్టులకి జోరుగా దరఖాస్తులు.. జిల్లా కేడర్‌కి చెందినవి కావడంలో పోటీ ఎక్కువే..!
TS Police Jobs 2022: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
TS Police Jobs 2022: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా ఇవే ఉండటంతో దరఖాస్తులు పోటా పోటీగా వస్తున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో స్థానికత అంశం కీలకంగా మారింది. దాదాపు 5 నుంచి 6లక్షల దరఖాస్తులు వస్తాయని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అంచనా వేస్తోంది.
రాష్ట్రంలోని 29 పోలీస్ యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ (AR) విభాగం పోస్టుల పరంగా హైదరాబాద్‌లో భారీగా బ్యాక్‌లాగ్‌లు మిగలడం ఇందుకు కారణమైంది. అన్ని యూనిట్లలో కలిపి ఏఆర్ విభాగంలో 978 బ్యాక్‌లాగ్ పోస్టులుండగా హైదరాబాద్ కమిషనరేట్‌లోనే 943 ఉండడం గమనార్హం. విభాగాల వారీగా పరిశీలిస్తే ఈసారి టీఎస్‌ఎస్పీ పోస్టుల సంఖ్య 5010. అలాగే ఎస్పీఎఫ్ పోస్టులు 390 ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులే ఉన్నా ఎంపికలో మాత్రం జిల్లాలవారీగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలివే:
సివిల్ కానిస్టేబుల్స్ - 4965
ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
ఎస్ఏఆర్ సీఎల్ – 100
టీఎస్ఎస్‌పీ – 5010
స్టేట్ స్పెషల్ పోలీసు ఫోర్స్ – 390
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ - 610
జైళ్ల శాఖ(పురుషులు) – 136
జైళ్ల శాఖ (స్త్రీలు )- 10
ఐటీ, కమ్యూనికేషన్ - 262
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)- 21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్) - 100