TS EAMCET: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు
TS EAMCET: తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
TS EAMCET: తెలంగాణలో ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభమై మే 14 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14న జరగనున్నాయి. JNTU హైదరాబాద్ ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది.
TS EAMCET కోసం 3 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించే ఏఎం స్ట్రీమ్ పరీక్షకు మొత్తం లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మే 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు 2 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలంగాణలోని 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 33 కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.