TS EAMCET: ఎంసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. మే10 నుంచి14 వరకూ ఎంసెట్ పరీక్షలు

TS EAMCET: ఇవాళ్టినుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం

Update: 2023-04-30 07:42 GMT

TS EAMCET: ఎంసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. మే10 నుంచి14 వరకూ ఎంసెట్ పరీక్షలు

TS EAMCET: రాష్ట్రంలో ఎంసెట్ హాల్‌టికెట్లు ఇవాళ్టి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి 14 వరకు నిర్వహించే ఈ ఎగ్జామ్ కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దాదాపు 3లక్షల 20 వేల మంది విద్యార్ధులు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు ఎంసెట్ కు అప్లై చేసుకున్నారు. అయితే మే 10 నుంచి 14 వరకు నిర్వహించే ఎంసెట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈసారి అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. ఎంసెట్ కోసం పరీక్షా కేంద్రాలను పెంచనున్నారు. అయితే ఎంసెట్‌ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక 'కీ' ని, రెస్పాన్స్‌షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

అలాగే ఎంసెట్‌ రాసే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా వారికిచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్ ను ఎంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ కేటాయిస్తే అక్కడే పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. కాగా, తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Tags:    

Similar News