TS DSC 2023: తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

DSC Notification 2023: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది.

Update: 2023-08-24 09:26 GMT

TS DSC 2023: తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

DSC Notification 2023: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.

మరో రెండు రోజుల్లో డీఎస్పీ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. గతంలో టీచర్ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయగా ఈ సారి మాత్రం.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతకు ముందు మాదిరిగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు చైర్మన్ గా ఉంటారని.. అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ డీఈఓ సెక్రటరీగా ఉంటారని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయన్నారు.

Tags:    

Similar News