Career News: బీటెక్‌, ఎంబీబీఎస్‌ కంటే ఈ కోర్సులు బెస్ట్‌.. కెరీర్‌లో మంచి సంపాదన..!

Career News: చాలా రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి.

Update: 2023-03-20 07:00 GMT

Career News: బీటెక్‌, ఎంబీబీఎస్‌ కంటే ఈ కోర్సులు బెస్ట్‌.. కెరీర్‌లో మంచి సంపాదన..!

Career News: చాలా రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీని తర్వాత ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదవాలనుకుంటారు. కానీ అందరికి సీట్లు రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొంతమంది ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యి మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఉంది. కోరుకున్న కోర్సులో అడ్మిషన్ పొందలేకపోతే టైమ్‌ వేస్ట్‌ చేయకూడదు. కెరీర్‌లో ముందుకు సాగడానికి బెస్ట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. ఇంజనీరింగ్ డిప్లొమా

IIT, NIT లేదా ఏదైనా మెరుగైన కళాశాలలో సీటు రాకపోతే చింతించాల్సిన పనిలేదు. ప్లాన్ B కింద కొన్ని కోర్సులలో చేరవచ్చు. మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందవచ్చు. అందులో పాలిటెక్నిక్‌ ఒకటి. ఈ మూడేళ్ల కోర్సు ఫీజు చాలా తక్కువ. B.Tech వారికి వచ్చే ఉద్యోగమే వీరికి లభిస్తుంది. నేటికీ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లుగా డిప్లొమా హోల్డర్లకు బాగా డిమాండ్ ఉంది. ఇంకా చదవాలనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు. వీటిలో ఫార్మసీ, పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ డిజైన్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు మీ కోసం వేచి ఉన్నాయి.

2. మెడికల్ ఫీల్డ్ అవకాశాలు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో మొత్తం లక్ష సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆయుష్‌లో దాదాపు 55 వేల సీట్లు ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా 15 లక్షల మంది పోటీపడుతారు. ఒకటిన్నర లక్షల మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. మిగిలిన 13.5 లక్షల మంది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. బీవీఎస్సీలో ప్రవేశం నీట్ పరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ కోర్సు చేస్తున్న యువత పశువైద్యం చేస్తారు. బిఎస్‌సి-నర్సింగ్‌తో పాటు డజను పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశం కూడా ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా సెంట్రల్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

3. బి-ఫార్మా చేయండి

ఈ నాలుగేళ్ల కోర్సు కెమిస్ట్రీ, బయాలజీతో ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థుల కోసం అందుబాటులో ఉంది. ఇందులో అడ్మిషన్ కోసం పెద్దగా గొడవ ఉండదు. మీ దగ్గరలో ఉన్న కళాశాల నుంచి ఈ కోర్సు చేయవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు ఉంటాయి. డ్రగ్స్ తయారీలో భారతదేశం అగ్రగామిగా ఉంది. అందుకే రాబోయే సంవత్సరాల్లో ఈ కోర్సుకి బాగా డిమాండ్ ఉంటుంది. ఇందులో మెరుగ్గా రాణించాలంటే మాస్టర్స్, పీహెచ్‌డీ చేసి మెడిసిన్ రంగంలో పరిశోధన చేయవచ్చు. ఈ రంగంలో మంచి డబ్బు, పూర్తి గౌరవం లభిస్తుంది.

4. BCA

మీకు కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఏదైనా కారణం వల్ల బి.టెక్‌లో చేరలేకపోతే చింతించవద్దు. మీరు BCAలో అడ్మిషన్ తీసుకొని కంప్యూటర్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. ఏదైనా స్ట్రీమ్ నుంచి ఇంటర్ ఉత్తీర్ణులైన యువత BCA చేయడానికి అర్హులు. ఈ కోర్సు సాధారణంగా ప్రతి విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉంటుంది. కాలేజీ బాగుంటే మూడేళ్ల కోర్సు చేసిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ ఫిక్స్ అవుతుంది. బాగా చేయడానికి మీరు MCA చేయవచ్చు. BCA+MCA ఇంటిగ్రేటెడ్ కోర్సును కూడా ఇప్పుడు అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

Tags:    

Similar News