Most Demanding Jobs In India 2024: దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే..!
Most Demanding Jobs In India 2024: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అవసరాలు, పరిస్థితులను బట్టి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూ, తగ్గతూ ఉంటుంది.
Most Demanding Jobs In India 2024: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అవసరాలు, పరిస్థితులను బట్టి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూ, తగ్గతూ ఉంటుంది. యువత ఎవ్వరైనా సరే గ్రాడ్యూయేట్ అవ్వగానే మంచి ప్యాకేజీతో ఉన్నతమైన కంపెనీలో జాబ్ చేయాలని కోరుకుంటారు. మరికొందరు సర్వీస్ ఓరియేంటెడ్ కింద గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలా ఏ ఏడాది దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్పెషలిస్ట్
డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరగడంతో ఈ రంగాల్లో స్కిల్స్ ఉన్న వ్యక్తులకు భారీ డిమాండ్ ఉంది. SEO, PPC, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
2. డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్
డేటా అనాలిసిస్, మెషీన్ లెర్నింగ్ టెక్నిక్ వాడకం పెరగడంతో ఈ రంగాల్లో స్మార్ట్ వ్యక్తులకు భారీ డిమాండ్ ఉంటుంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ AI లలో నిపుణులైన వ్యక్తులు అధిక జీతాలు, అద్భుతమైన కెరీర్ అవకాశాలను పొందుతారు.
3. పూర్తి-స్టాక్ డెవలపర్
వెబ్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ డిమాండ్‌లో ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. HTML, CSS, JavaScript, ReactJS, NodeJS, Python, Django వంటి నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యం ఉంది.
4. క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్
క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుతున్న వినియోగంతో, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, DevOpsలో స్కిల్స్ కలిగిన వ్యక్తులకు భారీ డిమాండ్ ఉంది. AWS, Azure, Google Cloud Platform, Kubernetes వంటి స్కిల్స్ కలిగిన వ్యక్తులు సులభంగా అధిక జీతంతో ఉద్యోగాలు పొందుతారు.
5. హెల్త్‌కేర్, మెడికల్ సెక్టార్
వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, పారామెడికల్ సిబ్బందికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.