Highest Salary Jobs: 2024లో భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇవే.. ఒక్కసారి వస్తే లైఫ్‌ సెటిల్డ్‌..!

Highest Salary Jobs 2024: చదువు తర్వాత అందరి దృష్టి జాబ్‌పైనే ఉంటుంది. మంచి కంపెనీలో పెద్ద జాబ్‌ సంపాదించి భారీగా జీతం పొందాలని ఆశిస్తారు.

Update: 2023-09-29 14:30 GMT

Highest Salary Jobs: 2024లో భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇవే.. ఒక్కసారి వస్తే లైఫ్‌ సెటిల్డ్‌..!

Highest Salary Jobs 2024: చదువు తర్వాత అందరి దృష్టి జాబ్‌పైనే ఉంటుంది. మంచి కంపెనీలో పెద్ద జాబ్‌ సంపాదించి భారీగా జీతం పొందాలని ఆశిస్తారు. కానీ ఇది అందరికి సాధ్యంకాకపోవచ్చు. కానీ కష్టపడితే సాధించనిదంటూ ఏదీ లేదు. 2024లో అత్యధిక జీతాలు చెల్లించే కొన్ని రంగాలు ఉన్నాయి. వీటిలో జాబ్‌ వస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవయసులోనే సెటిల్‌ అవుతారు. అలాంటి ఉద్యోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆరోగ్య సంరక్షణ

వైద్య సేవలకు ఫుల్‌ డిమాండ్ కారణంగా వైద్యులు, సర్జన్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు వంటి నిపుణులు ఇతర వృత్తుల కంటే ఎక్కువ జీతాలు పొందుతారు. వైద్యరంగానికి నిరంతరం డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే ఇది మనిషి ఆరోగ్యానికి సంబంధించినది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్‌లో నిరంతరం డిమాండ్ ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది. అందుకే ఇలాంటి రంగాలలో ఉద్యోగం చేసేవారికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. భారీ ప్యాకేజీలు ఉంటాయి.

ఫైనాన్స్

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, హెడ్జ్ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ అభ్యసించినవారు మంచి జీతం పొందవచ్చు. ఎందుకంటే డబ్బులు ప్రజలకు నిరంతరం అవసరమవుతాయి.

న్యాయవాదులు

ప్రత్యేకించి కార్పొరేట్ చట్టం లేదా మేధో సంపత్తి వంటి ప్రత్యేక రంగాల్లో ఉన్నవారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు.

డేటా సైంటిస్ట్, అనలిటిక్స్

డేటా సైంటిస్ట్‌లు, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్లు, AI నిపుణులకు అధిక డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే సంస్థలు నిర్ణయాలు తీసుకునేలా డేటాను ప్రభావితం చేస్తాయి.

ఏవియేషన్

ప్రధాన విమానయాన సంస్థల్లో పైలెట్‌గా చేరడం వల్ల మంచి జీతం సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా, దేశీయ విమానాలు వేగంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ 2024లో పెరుగుతుందని అందరు భావిస్తున్నారు.

ఫార్మాస్యూటికల్స్

ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఫార్మాస్యూటికల్ సేల్స్‌లో నిపుణులు కూడా అధిక జీతాలు పొందుతారు.

Tags:    

Similar News