NEET Exam: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..

NEET Exam: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయి అర్హత నీట్‌ పరీక్ష

Update: 2023-05-07 01:56 GMT

NEET Exam: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..

NEET Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష ఇవాళ నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష కోసం హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షకేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు . పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించే నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా 499 నగరాల్లో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జ‌రగనుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

వైద్య విద్య కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. అయితే పరీక్ష సందర్భంగా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.ప‌రీక్ష రాసే విద్యార్థులు ప‌రీక్ష స‌మ‌యం కంటే గంట ముందుగా తమ తమ సెంటర్ లకు చేరుకుంటే మంచిందని చెప్తున్నారు. ప‌రీక్ష కేంద్రాన్ని ముందే చెక్ చేసుకోవాలని. కొన్ని న‌గ‌రాల్లో ఒకటే పేరు మీద పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి కాబ‌ట్టి ప‌రీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచిందని సూచిస్తున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్‌లోకి ఎవరినీ అనుమతించరు. కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు వరకు విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఆధారంగా.. ఏ గదిలో మీ సీట్ ఎలాట్ చేశారో చూసుకోవాలని చెప్తున్నారు. 1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్‌లెట్ ఇస్తారు కాబట్టి మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్‌లెట్‌లో నింపాల్సి ఉంటుందని చెప్తున్నారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలని ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాలని తెలిపారు.

పరీక్ష రాసే విద్యార్థులు పాటించవలసినవి...

--- అభ్యర్థులు డ్రెస్‌ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

--- స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.

--- పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు.

--- చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించకూడదు.

--- మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, పేజర్స్‌, హెల్త్‌ బ్యాండ్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్‌ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకెళ్లకూడదు.

--- అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవ‌స‌ర‌మైన‌ బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.

Tags:    

Similar News