TET Exam: రేపు తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష

TET Exam: రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Update: 2023-09-14 06:54 GMT

TET Exam: రేపు తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష

TET Exam: తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు శుక్రవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న టెట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో సెలవులు కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షను నిర్వహించేందుకు మొత్తం 2 వేల 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

శుక్రవారం జరగనున్న టెట్ పరీక్షకు 4 లక్షల 78 వేల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం 2 వేల 52 ఎగ్జామ్ సెంటర్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ వన్‌కు 2 లక్షల 69వేల 557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ వన్ ఎగ్జామ్ కోసం కోసం ఒక వెయ్యి 139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పేపర్-2కు 2 లక్షల 8 వేల 498 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1 పరీక్ష కొనసాగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష జరగనుంది. టెట్ పరీక్ష కోసం 2 వేల 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 వేల 52 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 22 వేల 572 మంది ఇన్విలేజర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. ఎగ్జామ్ హాళ్లను చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్ష కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అభ్యర్థులు కనీసం గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News