Telangana: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ఈ ఏడాది దసరా, సంక్రాంతి సెలవులు ఇవే..!

TS Academic Calendar 2023-24: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

Update: 2023-06-07 08:57 GMT

Telangana: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ఈ ఏడాది దసరా, సంక్రాంతి సెలవులు ఇవే..!

TS Academic Calendar 2023-24: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. మొత్తం 229 పని దినాలుగా లెక్క తేల్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినంగా తెలిపింది. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తూ క్యాలెండర్‌లో వెల్లడించింది. ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. 2024 జనవరి 10 వరకు అన్ని తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-1 ఎగ్జామ్స్ ను ఈ ఏడాది జూలై 31 లోగా, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 11 వరకు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్‌ 12 లోపు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్‌ 8 నుంచి 2024 ఏప్రిల్‌ 18 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్‌ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 29లోపు, SSC బోర్డు పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.

Tags:    

Similar News