Telangana Jobs 2022: పాలిటెక్నిక్ విద్యార్థులకి శుభవార్త.. ఈ ఉద్యోగాలు అస్సలు మిస్ కావొద్దు..!
Telangana Jobs 2022: తెలంగాణలో పాలిటెక్నిక్, బీటెక్ చదివిన విద్యార్థులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Telangana Jobs 2022: తెలంగాణలో పాలిటెక్నిక్, బీటెక్ చదివిన విద్యార్థులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రానున్న రోజుల్లో నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. శనివారం ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా అమోదం తెలిపింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
84 మెకానికల్, 320 సివిల్, 100 అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, 200 ఎలక్ట్రికల్ పోస్టులు కలిపి 704 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా రంగాల్లో పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. వీటిలో 259 పోస్టులను మల్టీజోన్-1 (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు)కి, 445 పోస్టులను మల్టీజోన్-2 (యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు)కి కేటాయించారు.
వీటితోపాటు 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఇందులో 182 పోస్టులను సివిల్ ఇంజనీర్లకు, 45 మెకానికల్ ఇంజనీర్లకు కేటాయించారు. వీటిలో 112 పోస్టులను మల్టీజోన్-1కి, 115 పోస్టులను మల్టీజోన్-2 అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ఏఈఈ పోస్టులను బీటెక్ పట్టభద్రులతో భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ ఉద్యోగాలన్నింటికీ కలిపి.. ఒకే తరహా పరీక్ష నిర్వహించాలని ఇదివరకే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.