నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
Jobs in Telangana: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.
Jobs in Telangana: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.
ఇంజనీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 టెక్నికల్ పోస్టులకు అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చింది. భూగర్భ జలశాఖలో 88, ఆర్‌అండ్‌బీలో 38 ఏఈ, 145 సివిల్ ఏఈఈ 13 ఎలక్ట్రిక్ ఏఈఈ, 60 టెక్నికల్ ఆఫీసర్, 27 అసిస్టెంట్ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ పోస్టుల భర్తీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.