TS Police Jobs 2022: ఐదేళ్ల వయోపరిమితిపై స్పందించని ప్రభుత్వం.. ఆశగా ఎదురచూస్తున్న నిరుద్యోగులు..

TS Police Jobs 2022: ఐదేళ్ల వయోపరిమితిపై స్పందించని ప్రభుత్వం.. ఆశగా ఎదురచూస్తున్న నిరుద్యోగులు..

Update: 2022-05-18 01:14 GMT

TS Police Jobs 2022: ఐదేళ్ల వయోపరిమితిపై స్పందించని ప్రభుత్వం.. ఆశగా ఎదురచూస్తున్న నిరుద్యోగులు..

TS Police Jobs 2022: తెలంగాణలో భారీ స్థాయిలో చేపడుతోన్న పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని పెంచాలని కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడేళ్లు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచుతుందా లేదా అనేది తెలియడం లేదు. దీంతో నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. మరో వైపు పోలీసు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 20గా నిర్ణయించారు. అంటే అభ్యర్థులకి గడువుతేదీ మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం రెండేళ్లు వయోపరిమితి పెంచి నిరుద్యోగులని ఆదుకోవాలని అందరు కోరుకుంటున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో పోలీస్‌ శాఖలోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. 16,587 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి పోటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు కొంతమంది ఏజ్‌ లిమిట్‌ దాటిపోయారు. ప్రభుత్వం ఇప్పటికే కే యూనిఫాం పోస్టులకి 3 ఏళ్ల వయోపరిమితి పెంచింది. కానీ ఇంకా దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులు వీటికి అర్హులు కాలేకపోతున్నారు. వీరందరు ఈ నోటిఫికేషన్‌ కోసమే గత కొన్నిరోజులుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.

పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ గత నోటిఫికేషన్లలో ఫైర్, జైల్‌వార్డెన్, ఎక్సైజ్, ఢిప్యూటి జైలర్ వంటి పోస్టులకి వయసు ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు వాటిని కూడా తగ్గించి బోర్డు నోటిఫికేషన్ జరీ చేసింది. దీంతో నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. దీంతో చాలామంది మరో రెండేళ్లు వయసు పెంచాలని ఆందోళనలు చేస్తున్నారు.

Tags:    

Similar News