TS EAMCET 2023: ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు.. పరీక్ష తేదీలివే!

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.

Update: 2023-03-31 11:23 GMT

TS EAMCET 2023: ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు.. పరీక్ష తేదీలివే!

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News