Telangana:వైద్య విద్యార్థులకి శుభవార్త.. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు..
Telangana:వైద్య విద్యార్థులకి శుభవార్త.. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు..
Telangana: వైద్యవిద్యార్థులకి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్నఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం మొదలైన వివరాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీల సంఖ్య 94
ప్రొఫెసర్ పోస్టులు: 29
అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు: 11
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 18
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 36
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు. పే స్కేల్ నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్) లేదా ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎయిమ్స్ బీబీనగర్, తెలంగాణ 508126. దరఖాస్తు రుసుము రూ.1500గా నిర్ణయించారు. ప్రకటన విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.