Supreme Court Jobs: సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ చదివితే చాలు..!
Supreme Court Jobs: దేశ రాజధాని ఢిల్లీలో ఉండే సుప్రీం కోర్టు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Supreme Court Jobs: దేశ రాజధాని ఢిల్లీలో ఉండే సుప్రీం కోర్టు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 210 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఇంగ్లిష్ టైపింగ్లో నైపుణ్యంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఖాళీల సంఖ్య: 210
పోస్టుల వివరాలు: జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టులు
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.35,400ల నుంచి రూ.63,068ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యంతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్ష రోజున కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (25 మార్కులకు), ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ (35 మార్కులకు,10 నిముషాలు), ఎస్సే రైటింగ్ టెస్ట్ (2 గంటలు) కూడా నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్ధులకు: రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022